బీహార్ లోని సీతామర్హిలో ఉన్న జానకీ ఆలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఆయన బీజేపీపై మరోసారి విమర్శలు చేశారు. దేశంలో ఓట్ల దొంగతనం జరిగిందని ఆరోపించారు. ఓట్లను దొంగిలిస్తే బీహార్ ప్రజలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో ఓట్ల చోరీకి సంబంధించి మరిన్ని ఆధారాలు చూపిస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.