MNCL: హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నీటి ఇన్ ఫ్లో అధికంగా ఉన్నందున అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు.