అన్నమయ్య: సుండుపల్లి మండలంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు తనిఖీ చేశారు. మండపాల ఏర్పాటుకు పోలీస్, విద్యుత్ శాఖల అనుమతి కోసం 182 ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.