KMR: జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెట్కార్ గురువారం సాయంత్రం పరిశీలించారు. వర్షాల కారణంగా రహదారులు కోతకు గురైన పరిస్థితులను, లోతట్టు గ్రామాల్లోని ముంపు ముప్పును సీతక్క, షబ్బీర్ అలీ, సురేష్ కుమార్ శెట్కార్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలు గురించి చర్చించుకున్నారు.