GNTR: గుంటూరు నగర పాలక సంస్థ (GMC) ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. భారీ వర్షాల కారణంగా కాల్వలు నిండిపోయి రోడ్లపైకి నీరు వస్తున్నందున ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, డ్రైనేజ్ పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.