NLG: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లి మండలంలోని గుడివాడ, కాసనగోడు గ్రామాల్లో రూ. 20 లక్షల వ్యయం చొప్పున నిర్మించనున్న జీపీ భవనాలకు గురువారం శంకుస్థాపన చేశారు. కాసనగోడులో రూ. 14.50 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ గదిని ప్రారంభించారు. అనంతరం గుడివాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.