NZB: బాల్కొండ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వర్షపు నీరు చేరింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రి గదుల్లోకి నీరు చేరి అస్తవ్యస్తంగా తయారయింది. భవనం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపోతున్నాయి. దానితో రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొవాలని కోరారు.