BPT: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం వర్షాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా జిల్లాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.