MNCL: నస్పూర్ కాలనీలోని సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 30 మంది కాంట్రాక్టు కార్మికులు గురువారం ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా వారికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.