NGKL: తెలకపల్లి మండలం కర్వాంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుడిగా మారి తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.