GDWL: గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్&ఆర్ సెంటర్లో గురువారం తెల్లవారుజామున ఒక ట్రాక్టర్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో రెండు స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కరెంటు సరఫరా నిలిపివేయడానికి ఏబీ స్విచ్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.