TPT: శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో స్థానిక ఐమాప్ పరిశ్రమ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పుత్తూరు మండలంలోని పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 7.5 లక్షలు విలువచేసే 15 కంప్యూటర్లు వితరణ చేసింది. ఇందులో భాగంగా కంప్యూటర్లు వితరణ పట్ల కళాశాలల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.