BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన ఓటర్ల జాబితాను నోటీసు బోర్డుపై ఉంచినట్లు పంచాయతీ కార్యదర్శి శైలజ తెలిపారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీ లోపు తెలియజేయాలని ఆమె కోరారు. తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.