HYD: విధులకు ఆలస్యంగా హాజరైన ఉద్యోగులపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై ఈరోజు మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉదయం 10:40 గంటల వరకు కూడా విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. హాజరుకాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.