NZB: కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే 48 గంటలలో జిల్లాలో భారీ వర్షాల అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.