KNR: కరీంనగర్ లోయర్ మానేరు జలాశయాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. డ్యాములోకి వస్తున్న వరద ప్రవాహం వివరాలు తెలుసుకున్నారు. ఇన్ ఫ్లో 55 వేల క్యూసెక్కులు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.