WNP: కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా వనపర్తి జిల్లాలోని అత్యధిక రైతులకు సాగునీరు అందించే విధంగా కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కేఎల్ఐకి సంబంధించిన రిజర్వాయర్, కాలువలు, భూసేకరణ పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందుతుందన్నారు.