BDK: దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామం విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సీపీయం పార్టీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల 25వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.