ADB: జిల్లా భీంపూర్ మండలంలో నిపాని సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గం గుండా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ బస్సును సిబ్బంది నిలిపివేశారు. మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నీటి ప్రవాహ తీవ్రత తగిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.