NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన స్వగ్రామం బడేవారిపాలెంలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇవాళ పంపిణీ చేశారు. తహసీల్దార్ నయీమ్ అహ్మద్‌తో కలిసి గ్రామంలోని పలు ఇళ్లకు వెళ్లి కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్డులోని క్యూఆర్ కోడ్ ద్వారా అక్రమాలను అరికట్టవచ్చని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి స్మార్ట్ కార్డులు అందేలా చేస్తుందని తెలిపారు.