NLR: విడవలూరు మండలంలోని రామతీర్థం గ్రామంలో ఇవాళ ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు వేరుశెనగ పంట పొలాలను పరిశీలించారు. పొలాల్లో పచ్చపురుగు ఉందని, దాని నివారణకు వాడుకోవాల్సిన మందులను రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ దేవసేన, ఎంఏవో లక్ష్మి, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.