KDP: కమలాపురం మండల పరిధిలోని పాపాగ్ని నదిపై నూతనంగా నిర్మించిన వంతెనపై అధికారులు గురువారం నుంచి రాకపోకలను ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన భారీ వరదలకు పాత వంతెన కొట్టుకుపోవడంతో, అధికారులు అదే స్థానంలో నూతన వంతెనను నిర్మించారు. దీంతో వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.