TG: ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 2 వేల మందిని రక్షించినట్లు చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షించినట్లు డీజీపీ వివరించారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.