శ్రీకాకుళం: కొత్తూరు మండలం కురిగాం గ్రామంలో అంగన్వాడీ, సచివాలయ ఆవరణంలో ఉన్న విద్యుత్ స్తంభాలు గత నాలుగు నెలలుగా రాత్రి పగలు వెలుగుతూనే ఉన్నాయని గురువారం అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. గ్రామంలో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉందని పేర్కొన్నారు. వర్షాకాలంలో నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని వాపోయారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.