CTR: బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఆ జిల్లా ఎస్పీ జగదీశ్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్.సుమతి, ఎస్.గీత, ఎస్.రంజిత్, ఎస్.బృందను అరెస్ట్ చేశామని చెప్పారు. అనంతరం వారి నుంచి రూ.23 లక్షలు విలువైన 242.5 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.