GDWL: జోగులాంబ గద్వాల జిల్లా నూతన బీసీ సంక్షేమ అధికారిగా సయ్యద్ అక్బర్ పాషా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు సూర్యాపేట జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేసిన ఆయనకు పదోన్నతి లభించడంతో గద్వాల జిల్లాకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.