మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణా కేంద్రం నుంచి ముందస్తుగా ఇవాళ గర్భిణులు, బాలింతలను పలు ఆసుపత్రులకు తరలించారు. గోదావరి వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద పెరిగితే మాతా శిశు సంరక్షణా కేంద్రాన్ని ముంచెత్తుతుంది. దీంతో ఆసుపత్రిలో ఉన్న వారిని స్వచ్ఛందంగా తరలించారు.