SRD: సంగారెడ్డి సదాశివపేట పట్టణంలోని చెరువులను ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం పరిశీలించారు. మొదట సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువును చూశారు. అనంతరం సదాశివపేట పట్టణంలోని ఉబ చెరువును కూడా పరిశీలించారు. రెండు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటువైపు ఎవరు కూడా రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.