TG: కామారెడ్డిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోచారం డ్యామ్ ప్రస్తుతానికి సురక్షితంగా ఉంది. ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్లు నివేదిక ఉంది. వరదలతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. వరద తగ్గాక నష్టం అంచనా వేస్తాం’ అని పేర్కొన్నారు.