అన్నమయ్య: మదనపల్లి మండలం గాజులవారిపల్లికి చెందిన మంజుల అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసకుంది. వివరాల్లోకెళ్తే రామసముద్రం రెవెన్యూ అధికారులు తన తండ్రి పేరుపై ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిని దాయాదులు కబ్జా చేసినా న్యాయం చేయలేదని ఆరోపిస్తూ, గురువారం మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా, ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.