TPT: స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఛైర్మన్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 40వ సమావేశం గురువారం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ప్రాజెక్టుతో పాటు ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు.