KNR: కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం నుంచి దిగువ మానేరు జలాశయంలోకి 55 వేల 829 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. డ్యామ్ కెపాసిటీ 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.652 టీఎంసీల నిల్వ ఉంది. 920 అడుగులకు గాను నీటిమట్టం 909.10కి చేరింది. వివిధ అవసరాల కోసం 269 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.