AP: రాష్ట్రంలో ఉల్లి ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత రెండు రోజులుగా ఉల్లి ధరలు పెరిగాయి. దీంతో ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సామాన్యులపై భారం పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలని సూచించారు.