KMM: కొణిజర్ల మండలం లాలాపురం- తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని గురువారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. వరద తీవ్రతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమయం అయిన రోడ్లు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 1077 కు సమాచారం ఇవ్వాలని కోరారు.