HYDలో వైభవంగా గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 6వ తేదీ వరకు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కామెంట్స్ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండరాదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.