NLR: ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరులో ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మల్లికార్జున మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోజు అరగంట వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్వో కె. అరోరా, ఫస్ట్ అసిస్టెంట్ సుధాకర్ రావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.