KMR: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు స్పందన విభాగం డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి గురువారం కామారెడ్డిలో పర్యటించారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హన్మంత్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితి, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.