MBNR: రాబోయే వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి జిల్లా కేంద్రంలోని ఆరవ వార్డు పరిధిలో ఉన్న పాలకొండ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.