KDP: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ స్వామి ఆలయ నూలు పూజోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారు హనుమంతుని వాహనం పై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.