NLR: ఉదయగిరి మండలం గంగుల వారి చెర్లోపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇవాళ ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచి మతకాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు హాజరయ్యారు. పోటీల్లో విజేతలకు బొల్లినేని బహుమతులు ప్రధానం చేశారు.