MNCL: జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. ఇవాళ జన్నారంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాలతో జరిగిన నష్టంపై అధికారుల నుంచి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామన్నారు.