SRPT: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ కలిసి నిరుద్యోగ సమస్యలు చర్చించారు. ఈ సందర్భంగా వారు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని, స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. అలాగే నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానం రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.