SKLM: టెక్కలి మండలం బూరగాం ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం బడి ఆవరణలో అ, ఆ ఆకారంలో కూర్చుని ఆకట్టుకున్నారు. తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులంతా తెలుగు వర్ణమాలలో మొదటి రెండైనా అక్షరాలైన అ, ఆ ఆకారంలో కూర్చొన్నారు. తెలుగుపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించారు. వీరిని పాఠశాల సిబ్బంది అభినందించారు.