KNR: డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వరద నీరు తమ ఇండ్లలోకి వస్తున్నదని చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన చీకట్ల శ్రీనివాస్ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ బస్టాండ్ సమీపంలోని నాలుగో వార్డు తమదని, సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.సంపు ట్యాంకులు, పశువుల షెడ్లలోకి వర్షపు నీరు చేరుతున్నదని చెప్పారు.