శ్రీకాకుళం: జిల్లా రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ పైడిపు నాయుడు, ఎస్ఐ రాము ఆధ్వర్యంలో గురువారం కార్డన్ సర్చ్ నిర్వహించారు. పాత్రనివలస, పెద్దపాడు, సింగపురం, టిడ్కో కాలనీ వద్ద తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 5 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ఆయనతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.