RR: ఇటీవల కొంతమంది బీజేపీలో చేరారన్న వ్యాఖ్యలపై కేశంపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వారు ఎవరు వీడలేదని, గతంలో బీజేపీలో ఉన్నవారే మళ్లీ ఆ పార్టీ కండువాలు వేసుకొని అందర్నీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.