NLG: క్రీడల పట్ల విద్యార్థులు యువత ఆసక్తిని పెంచుకుని రాణించాలని కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని రేపు జరిగే క్రీడా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు జరిగే క్రీడా రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.