KNR: బషీర్బాగ్ విద్యుత్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణలకు శంకరపట్నం మండల CPI నాయకులు నివాళులర్పించారు. మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అమరులైన వారి కుటుంబాలకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, నేటికీ వారికి న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.