SRD: కంగ్టి మండలం గాజులపాడు శివారులో నేడు రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో గాజులపాడ్, సుకలతీర్థ్, పరిధి తండాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక విద్యుత్ లైన్మెన్ రవీందర్, సిబ్బంది కలిసి నేలకొరిగిన స్తంభాలను, పైకెత్తి మరమ్మతులు చేశారు. వర్షంలో సైతం లోపాన్ని గుర్తించి కరెంట్ సరఫరా అందజేసిన సిబ్బందికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.