NGKL: పదర మండల కేంద్రానికి చెందిన కబడ్డీ క్రీడాకారిణి బండి నందిని, డిల్లీ సోనిపత్‌లో జరుగుతున్న ఇండియా కబడ్డీ క్యాంప్‌కు ఎంపికైంది. ఆమె ఢిల్లీ బయలుదేరేందుకు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి స్వయంగా విమాన టికెట్ బుక్ చేసి, ఖర్చులకు సాయం చేశారు. ఈ సహకారంపై నందిని కుటుంబసభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.